Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం..

హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం..

- Advertisement -

మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 
పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి 
లేకుంటే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల ప్రక్షాళన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మీరెన్ని కేసులు పెట్టినా న్యాయవ్యవస్థ ద్వారా ఎదుర్కొంటామని, న్యాయ వ్యవస్థ పై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇటీవల వేల్పూర్ సంఘటనలో బనాయించిన అక్రమ కేసుల్లో బెయిల్ మంజూరైన బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను మంగళవారం ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన వేల్పూర్ సంఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టినా,  హైకోర్టు ఈ కేసులన్నీ అక్రమం అని స్పష్టం చేస్తూ కార్యకర్తలందరికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొని బెయిల్ మంజూరైన కార్యకర్తలు మహేష్, నితీష్, లాల, రహమాన్, గంగాధర్ గౌడ్ లను వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..నంగి దేవేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు మహబూబ్ నగర్ ప్రాంత వాసి,అక్కడ నుండి  వేల్పూర్‌లో నా ఇంటి లోపలికి వచ్చి దాడికి దిగాడన్నారు. దాడి చేయడానికి వచ్చిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, ఆ దాడిని అడ్డుకునే క్రమంలో జరిగిన చిన్న తోపులాటను కేంద్రంగా తీసుకుని రేవంత్ రెడ్డి, పోలీసులు మా కార్యకర్తల మీదే అక్రమంగ హత్యయత్నం కేసులు పెట్టడం శోచనీయం అన్నారు.దీనిని ప్రజా పాలన అంటారా? అని ప్రశ్నించారు.ప్రజల పక్షాన హామీల అమలు కోసం ప్రశ్నించిన వారిపై రేవంత్ రెడ్డి  చేస్తున్న కక్షసాధింపు చర్యలని  స్పష్టమవుతోందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.మా కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వాటిని మేము న్యాయవ్యవస్థలో ధైర్యంగా ఎదుర్కొంటామని, న్యాయస్థానాలపై మాకు  పూర్తి నమ్మకం,విశ్వాసం ఉందన్నారు.పోలీసులు ఇకనైనా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చుట్టంలా కాకుండా చట్టానికి లోబడి పని చేయాలని, లేకుంటే అటువంటి పోలీస్ లు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -