Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యేక రెవెన్యూ నక్ష మ్యాప్ రూపొందిస్తాం: కలెక్టర్

ప్రత్యేక రెవెన్యూ నక్ష మ్యాప్ రూపొందిస్తాం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – గండీడ్
మండల పరిధిలో సాలార్ నగర్ గ్రామంలో శుక్రవారం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన సందర్భంగా 40 రోజులపాటు కొనసాగిన భూ సర్వే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హాజరై ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు జిల్లాలను ఎంపిక చేసుకొని అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.1923 చట్టం ఆక్ట్ ప్రకారం గ్రామానికి సంబంధించిన రెవెన్యూ నక్ష రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ రెవెన్యూ నక్ష రూపొందించడం వల్ల రైతులకు తమ భూమి యొక్క సర్వే నెంబర్లను ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రైతుల యొక్క భూమి పట్టాదారుని పేరుమీద లేకుండా ఇతరుల పేరు మీద పడినట్లయితే నక్ష ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.కన్సల్టెన్సీ పహాని పట్టాదారుని వివరాలను తెలుసుకోవడానికి ఈ రెవెన్యూ నక్ష వల్ల రైతుల యొక్క భూమి హద్దులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఎంజాయ్ మెంట్ సర్వే చేసి ఫీల్డ్ రిజిస్టర్ నక్ష ప్రకారం 61 మంది భూమి రికార్డులో ఉన్నట్లు  తెలిపారు 9 మంది మోకపై ఉండి రికార్డులో లేనట్లు ఆమె అన్నారు.

ప్రభుత్వ భూముల విషయంపై పారదర్శకంగా సమగ్ర విచారణ చేపట్టి వారి వారి భూములను వారికి అప్పగించేటట్లు కృషి చేయాలని అన్నారు. మళ్లీ అవసరమైతే  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రీ సర్వే నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని ఆమె తెలిపారు.కార్యక్రమంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి,ఆర్డీవో నవీన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కిషన్ రావు, తహసీల్దార్ మల్లికార్జున రావు,ఎంపీడీవో హరిచంద్ర రెడ్డి,డిప్యూటీ తహసీల్దార్ మాధవి, ఆర్ఐ యాసిన్,పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -