Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటర్ జాబితాలో తప్పులపై 6 న కలెక్టర్ కి కంప్లైంట్ ఇస్తాం

ఓటర్ జాబితాలో తప్పులపై 6 న కలెక్టర్ కి కంప్లైంట్ ఇస్తాం

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
ఓటరు జాబితాలో తప్పులపై ఆరవ తేదీన కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తామని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ లో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ ల అధ్యక్షులు, ఇంచార్జీ లకు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ..కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఓటరు జాబితా విడుదల చేయడం జరిగింది.ఆ జాబితాలో ఎన్నో తప్పులను మేము గుర్తించడం జరిగింది.అన్ని డివిజన్ లలోని మాజీ కార్పొరేటర్లు,అధ్యక్షులు, ఇంచార్జీ ఓటర్ జాబితాను పరిశీలించడం జరిగింది.బీజేపీ నాయకుల మాదిరిగా కేవలం పది నిమిషాలు చూసి తప్పులు ఉన్నాయని అధికారుల దగ్గరికి వెళ్ళే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదు.బీజేపీ నాయకులు ఒకరు మాట్లాడుతూ కాంగ్రెస్ లో అభ్యర్థులు లేరు అని మాట్లాడుతున్నారు.ఒక్కసారి కాంగ్రెస్ కార్యాలయాన్ని చూసి ఆ మాట మాట్లాడాలి ఒక్కో డివిజన్ నుండి దాదాపు 10 మంది పోటీలో ఉన్నారు.ఈ నెల 5 వ తేదీన మున్సిపల్ కమిషనర్ ను,6 వ తేదీన కలెక్టర్ ని ఓటర్ జాబితాలో తప్పులపై కలుస్తాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -