Wednesday, December 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టుకు వెళతాం: బీఆర్ఎస్

స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టుకు వెళతాం: బీఆర్ఎస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్‌ స్పందించింది. తీర్పు కాపీని అధ్యయనం చేసిన తర్వాత  స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. స్పీకర్‌ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు BRS ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -