నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన బీసీ జేఏసీ సమావేశంలో ఈ నెల 18న జరిగిన బీసీ జేఏసీ బంద్ విజయంలో సమిష్టి కృషి ఉందని జేఏసీ నాయకులు అన్నారు. ఈ బంద్ విజయం స్పూర్తితో త్వరలో నిరంతర కార్యాచరణని రూపొందిస్తున్నామని కామారెడ్డి గడ్డ నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లుని చట్టబద్ధంగా 9వ షెడ్యూల్ లో చేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. అగ్రవర్ణ అహంకారుల కుట్రల్ని తిప్పికొట్టే విదంగా, బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు.
అఖిలపక్ష రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీ ల రిజర్వేషన్లు కు మద్దతు తెలిపిన నేపథ్యంలో, రిజర్వేషన్లు చట్టబద్ధంగా అయ్యే విధంగా పార్లమెంట్ లో ఆమోదం తెలిపి,9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా ఉద్యమాన్ని చెయాలని అన్నారు. స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు అదే విధంగా విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నీల నాగరాజు, సాప శివరాములు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఎంజీ వేణు గోపాల్ గౌడ్, గణేష్ నాయక్, క్యాతం సిద్ధరాములు, వెంకట్ గౌడ్, మర్కంటి భూమన్న, చింతల శంకర్, రాజన్న, నర్సింలు, బాజ లలిత, కొత్తపల్లి మల్లన్న, మంజుల, అరుణ్, విట్ఠల్, రాజీవ్, రాజేందర్, హఫీజ్, శ్రీనివాస్, సాయికృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.



