Monday, December 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభావితరాలకు బౌద్ధ ధర్మాన్ని పరిచయం చేస్తాం

భావితరాలకు బౌద్ధ ధర్మాన్ని పరిచయం చేస్తాం

- Advertisement -

బౌద్ధ దేశాల రాయబారులతో మంత్రి జూపల్లి భేటీ
గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

భవిష్యత్‌ తరాలకు బౌద్ధ ధర్మాన్ని పరిచయం చేసేందుకు వారి చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను భద్రపరుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌ ట్రైడెంట్‌ హౌటల్‌లో ఆదివారం ఆసియా, బౌద్ధదేశాలు, ఇతర విదేశీ రాయబారులు, హైకమిషనర్లతో సమావేశమయ్యారు. తెలంగాణ బౌద్ధ వారసత్వం, అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక భాగస్వామ్యాలపై చర్చించారు.దక్షిణ భారతదేశంలో మహాయాన బౌద్ధానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఉందనీ, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందంటూ నాగార్జునకొండ, ఫణిగిరి, ధూలికట్ట, నెలకొండపల్లి, కోటిలింగాల వంటి బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను మంత్రి వారికి వివరించారు. నాగార్జునసాగర్‌లో నిర్మాణం జరుగుతున్న బుద్ధవనం బౌద్ధ హెరిటేజ్‌ థీమ్‌పార్క్‌ను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు, సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనంలతో కూడిన ప్రగతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో మలేషియా హై కమిషనర్‌ ముజాఫర్‌ షా బిన్‌ ముస్తఫా, శ్రీమతి నజ్వా బింటి జైనాల్‌, నేపాల్‌ రాయబారి డాక్టర్‌ శంకర్‌ ప్రసాద్‌ శర్మ, శ్రీమతి కల్పనా శర్మ, భూటాన్‌ రాయబారి మేజర్‌ జనరల్‌ వెట్సాప్‌ నామ్‌గయెల్‌, శ్రీమతి డా జామ్‌ థారులాండ్‌ రాయబారి శ్రీమతి ఛవనార్ట్‌ థాంగ్‌సుంఫంట్‌, కార్యదర్శి శ్రీమతి రూచీ సింగ్‌, శ్రీలంక హైకమిషనర్‌ శ్రీమతి మహిషిని కొలోన్‌, సెషెల్స్‌ హైకమిషనర్‌ శ్రీమతి హారిసోవా అకూష్‌, అంగోలా రాయబారి క్లిమెంటే కమేం, బెనిన్‌ రాయబారి ఎరిక్‌ జాన్‌ ఎం. జిన్సూ, కెనడా హైకమిషన్‌ మినిస్టర్‌ (కమర్షియల్‌) ఎడ్‌ జాగర్‌, హైకమిషన్‌ శ్రీమతి లినా సోవాని, ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేడ్‌ కమిషనర్‌ ఇయాన్‌ మార్టినస్‌, కుహన్‌ మదన్‌, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (రాష్ట్రాలు) ఏ అజరుకుమార్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ గణేశనాథన్‌ గియతిశ్వరన్‌, సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌, రష్యా కాన్సుల్‌ జనరల్‌ వాలెరి ఖోజ్‌దాయేవ్‌, మలేషియా కాన్సుల్‌ జనరల్‌ కే శరవణ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -