Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గట్టుసింగారం గ్రామాన్ని ఉత్తమ గ్రామా పంచాయతీగా తీర్చిదిద్దుతా

గట్టుసింగారం గ్రామాన్ని ఉత్తమ గ్రామా పంచాయతీగా తీర్చిదిద్దుతా

- Advertisement -

నవతెలంగాణ-అడ్డగూడూర్ : గట్టుసింగారం గ్రామాన్ని ఉత్తమ గ్రామా పంచాయతీగా తీర్చిదిద్దుతానని గ్రామ శాఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు  బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ  స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గా ఏనుగుతల ఉపేంద్ర నాగరాజు అన్నారు. ఆదివారం అడ్డగూడూరు మండలంలోని గట్టు సగారం గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఏనుగుతల ఉపేంద్ర నాగరాజు మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన  ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు చేరేలా కృషి చేస్తానన్నారు.  గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు.  పెన్షన్లు రాని వాళ్లకు పెన్షన్లు , మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్లకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా  చేస్తానని తెలిపారు.    ప్రజల కోసం ప్రత్యేకంగా దగ్గరుండి ఏ సమస్య ఉన్న పరిష్కరించి వారికి సహాయం చేస్తానని అన్నారు. ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటుచేసి క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచుతానని తెలిపారు. ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు మద్ది ధనంజయ , మద్ది మహేశ్వరి , నల్లబెల్లి మంజుల, కేశగాని స్వాతి ,మద్ది పరశురాములు, నీలగిరి వెంకటయ్య మర్సోజు రవీందర్, మద్ది రేణుక, చెరుకు నరసింహ, అల్వాల శంకర్, బలపరిచిన కాంగ్రెస్ నాయకులు నల్లబెల్లి యాదగిరి, గద్దల సోమయ్య , నల్లబెల్లి ఈరయ్య , చెరుకు మంగమ్మ , అల్వాల భూలక్ష్మి , ఏనుగుతల మమత , వల్లపు కిష్టయ్య ,మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -