Thursday, December 11, 2025
E-PAPER
Homeసీరియల్ఆర్గానిక్‌ కామెడీతో నవ్విస్తాం

ఆర్గానిక్‌ కామెడీతో నవ్విస్తాం

- Advertisement -

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా.సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్‌ వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మిస్తున్నారు.
డార్క్‌ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్‌ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం డైరెక్టర్‌ మురళీ మనోహర్‌ మీడియాతో ముచ్చటించారు.
నాకు రెగ్యులర్‌ మూవీస్‌ చేయడం ఇష్టం ఉండదు. నా తొలి సినిమా ‘సింబా’ రొటీన్‌కు భిన్నమైన మూవీ. ఆ మూవీతో పోలిస్తే ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌ సినిమా.
ఈ సినిమాకు పూర్ణ కథ అందించారు. మిగతా రైటర్స్‌, నేను స్క్రిప్ట్‌ సైడ్‌ వర్క్‌ చేశాం. తెలివైనవారు, తెలివి తక్కువ వారి మధ్య జరిగిన వార్‌ ఈ మూవీ కాన్సెప్ట్‌. తెలివైనవారు తెలివితక్కువ పనిచేసినా, తెలివితక్కువ వారు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారుతాయి అనేది హ్యూమరస్‌గా తెరకెక్కించాం. ఇందులో చాలా ఆర్గానిక్‌ కామెడీ ఉంటుంది. మనందరిలోనూ ఎంతో కొంత పిచ్చితనం ఉంటుంది. ఆ స్టుపిడిటీ నుంచి పుట్టే సహజమైన వినోదాన్ని తెరపైకి తీసుకొచ్చాం.
‘జాతిరత్నాలు, మత్తువదలరా 2’ వంటి మూవీస్‌ చూశాక ఈ మూవీలో హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా బాగుంటుంది అనిపించి తీసుకున్నాం. ఆమె చాలా బాగా పర్‌ఫార్మ్‌ చేసింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా తనే రాసి, పాడి కొరియోగ్రఫీ చేసింది.
ఇక మా మూవీలో బ్రహ్మానందంది కీ రోల్‌. ఆయనతోనే మూవీ మొదలై ఆయనతోనే పూర్తవుతుంది. అలాగే మరో ఇంపార్టెంట్‌ రోల్‌కు యోగి బాబుని తీసుకున్నాం. ఆయన కూడా అత్యద్భుతంగా నటించారు.
సినిమా నిడివి రెండున్నర గంటలు ఉంటుంది. అయితే ఎక్కడా లెంగ్తీగా ఉన్నట్లు అనిపించదు. సీన్‌ టు సీన్‌ ఎంజారు చేస్తారు. సరదాగా ఆడుతూ పాడుతూ సినిమా వెళ్తుంటుంది. ఒక్క సీన్‌ కూడా బోర్‌ కొట్టదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -