బకాయిలు చెల్లించకపోతే చర్యలు
ఆలయ ఈవో లక్ష్మి ప్రసన్న
నవతెలంగాణ-పాలకుర్తి
ఆలయ బకాయిదారులను వదిలిపెట్టబోమని, బకాయిలను వసూలు చేయడంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని ఆలయ ఈవో భాగం లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. శనివారం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఆలయ బకాయిదారులందరికీ ఏప్రిల్ నెలలో నోటీసులు అందజేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ బకాయి దారుల నుండి బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారమే ఆలయం ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుచున్నామని తెలిపారు. బకాయిదరులు బకాయిలు చెల్లించకుండా నిరాకరిస్తే బకాయిదారుల పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆలయ, రెవెన శాఖ ఆధ్వర్యంలో నోటీసులు తీసుకున్న ప్రతి బకాయిదారుడు బకాయిలను చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. బకాయి దారులు బినామీల పేరుతో టెండర్లలో పాల్గొంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బినామీ పేర్లతో టెండర్లను కైవసం చేసుకున్న రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
ఆలయ బకాయిదారులను వదిలిపెట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



