Saturday, August 2, 2025
E-PAPER
Homeజిల్లాలులక్నవరం చెరువుతో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం: మంత్రి సీతక్క 

లక్నవరం చెరువుతో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం: మంత్రి సీతక్క 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
లక్నవరంలో పంట కాలువలకు నీటిని విడుదల చేసిన మంత్రి సీతక్క త్వరలో రామప్ప చెరువు నుండి కెనాయిల్ ద్వారా లక్నవరం చెరువును పూర్తిగా నింపుతామని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మండలంలోని లక్నవరం పంట కాలువలకు శుక్రవారం మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత కొంతకాలంగా రైతులకు నాట్లు వేసుకోవడానికి నీటి కొరత ఉందని తెలుసుకొని, ఇటీవల లక్నవరం సరస్సు తూముల మరమ్మతు పనుల అనంతరం నీటిని విడుదల చేశామన్నారు.

ప్రస్తుతం లక్నవరం సరస్సు 28 ఫీట్ల నీటి మట్టం కలిగి ఉందని, మొత్తం 33 ఫీట్లు సామర్థ్యాన్ని సరస్సు కలిగి ఉందని అన్నారు. చెరువు కింద ప్రతి ఎకరానికి సాగునీర అందిస్తామని ఆ యొక్క చివరి రైతు కూడా పంట పండించుకునే విధంగా సమృద్ధిగా నీరు అందుతుందని పేర్కొన్నారు. రామప్ప చెరువు నుండి కెనాల్ ద్వారా త్వరలోనే లక్నవరం చెరువును నింపి రెండు పంటలకు సరిపడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు రైతుకు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -