Tuesday, August 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభార‌త్‌పై సుంకాలు పెంచుతాం: ట్రంప్

భార‌త్‌పై సుంకాలు పెంచుతాం: ట్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: 90 రోజుల విరామం త‌ర్వాత ఈనెల 1తో ట్రంప్ ట్రేడ్ వార్ మొదలుపెట్టిన విష‌యం తెలిసిందే. డీడాల‌రైజైష‌న్, ఉక్రెయిన్ పై యుద్దానికి ర‌ష్యాకు ప‌రోక్షంగా స‌హ‌క‌రిస్తుందంటూ మోడీ ప్ర‌భుత్వంపై ట్రంప్ రంకెలేశారు. భార‌త్ త‌మ మిత్ర‌దేశ‌మైనా..25శాతం టారిఫ్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రోసారి భార‌త్ ఎగుమ‌తుల‌పై సుంకాల‌ను పెంచ‌బోతున్న‌ట్లు హెచ్చ‌రించారు.

భార‌త్ పై సుంకాలు పెంచ‌బోతున్న‌ట్లు సోషల్‌మీడియా ద్వారా ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడ్డారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ మార్కెట్‌లో భార‌త్ భారీ లాభాలు పొందుతుంద‌ని ఆరోపించారు. రష్యాతో యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్‌ పట్టించుకోవడం లేదని, అందుకే ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతామని ట్రంప్‌ వెల్లడించారు. ఇదిలావుంటే వలస వ్యవహారాల్లోనూ అమెరికాను భారత్‌ మోసం చేస్తోందనీ వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి స్టీఫెన్‌ మిల్లర్‌ విమర్శించారు. దీనివల్ల తమ దేశ కార్మికులకు ఎంతో నష్టం జరుగుతోందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -