Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొండి వాగు కాలువకు ఇరు ప్రక్కల మరమ్మతులు చేయిస్తాం: ఎమ్మెల్యే 

మొండి వాగు కాలువకు ఇరు ప్రక్కల మరమ్మతులు చేయిస్తాం: ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని మునిగలవీడు మదనతుర్తి మధ్యలో ఉన్న మొండి వాగు ఇరుప్రక్కల మరమ్మతులు చేయించి నీరు వెళ్లే విధంగా కృషి చేస్తానని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొండి వాగు కు ఇరు ప్రక్కల మురికి తుమ్మలు విపరీతంగా పెరిగి వివిధ రకాల చెట్లతో కూడి ఉండడం వలన ఆ కాలువ ద్వారా వచ్చే నీరు  సక్రమంగా వెళ్లలేకపోవడం ద్వారా ఆ కాలువ నుండి ప్రక్క పొలాల మీదుగా ప్రవహించడం వలన రైతుల పంటలు నష్టపోతున్నాయని, పార్టీ కార్యకర్తలు ఆ గ్రామాల కార్యకర్తలు పట్నం శెట్టి నాగరాజు కొప్పు శ్రీనివాస్ బాలాజీ నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తో తెలపడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడి వెంటనే దీన్ని మరమ్మతులు చేయించాలని ఆదేశించారని అన్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న గ్రామాల కార్యకర్తలు హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుప్పతూరి రాజు యాదవ్ రాజు శీను సతీష్ కాలేరు మల్లేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -