-రాజ్యాంగ దినోత్సవంలో దీటీ బాలనర్స్
నవతెలంగాణ-బెజ్జంకి
డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే వివిధ రాజకీయ పార్టీలు పరిపాలన సాగిస్తున్నాయని..ఎస్సీ సామాజిక వర్గాలకు రాజకీయంగా సముచిత స్థానమిస్తేనే అయా రాజకీయ పార్టీలను గౌరవిస్తామని ఏఐఏవైఎస్ మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద దీటీ బాలనర్స్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని..రాజ్యాంగాన్ని అందరూ పరిరక్షించుకుంటేనే భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛయుతా జీవనం సాగించవచ్చునని ఎమ్మార్ఫీఎస్ నాయకుడు చింతకింది పర్షరాములు హెచ్చరించారు.ఎమ్మార్ఫీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోదుపల్లి రాజు, ఏఐఏవైఎస్ మండల ఉపాధ్యక్షుడు మాశం బాబు,మేకల మహేశ్,ఉప్పలేటి శ్రీనివాస్,కనగండ్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.
సముచిత స్థానమిస్తేనే..గౌరవిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


