Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తాం

అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తాం

- Advertisement -

పనులకు శంకుస్థాపన చేసిన ఎంఎల్ఏ బిఎల్అర్
నవతెలంగాణ మిర్యాలగూడ 

గత ప్రభుత్వంలో అభివృద్ధి కాగితాలకే పరిమితి అయిందని,సంవత్సరంలో అభివృద్ధి అంటే ఏంటో మేము చేసి చూపిస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం  పట్టణంలోని పలు వార్డులలో 70 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో పదేళ్లపాటు పదవులు ఏలిన నాయకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని అస్తవ్యస్తంగా చేపట్టారని, కాగితాల్లో మాత్రం అభివృద్ధిని ఆకాశానికి చూపించారని ఆరోపించారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి సరి చేసేందుకు తమకు రెండేళ్లు పట్టిందన్నారు.ఎట్టకేలకు ముఖ్యమంత్రిని ఒప్పించి మిర్యాలగూడకు నిధులు శాంక్షన్ చేయించామన్నారు.సంవత్సర కాలంలో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి మిర్యాలగూడకు నూతన శోభను తీసుకువస్తామని తెలిపారు.అన్ని వార్డులలో డ్రైనేజీ నిర్మాణాలు, సిసి రోడ్ల ఏర్పాటు,స్మశాన వాటికల నిర్మాణాలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బండి యాదగిరి రెడ్డి, రవి నాయక్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -