Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సానిటేషన్, వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం 

సానిటేషన్, వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం 

- Advertisement -
  • – కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి 
  • నవతెలంగాణ – కామారెడ్డి 
  • సానిటేషన్ వాటర్ వర్క్స్ విభాగం మున్సిపల్ సిఐటి యు నాయకులతో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి తో జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) జిల్లా అధ్యక్షుడు కందారపు రాజనర్సు తెలిపారు. కపిషనర్ తో జరిపిన చర్చల్లో కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ కార్మికుడు  మరణించిన అతని స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని,  60 సంవత్సరాల నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, అనారోగ్యంతో బందు అయిన వారిని యధావిధిగా వీధుల్లోకి తీసుకుంటానని, పారిశుద్ధ కార్మికులకు పనిముట్లు చీపుర్లు, పారలు, గ్లౌజులు, యూనిఫామ్,  వాహనాల ఇన్సూరెన్స్, రిపేర్ చేయిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగిందని రాజనర్స్ తెలిపారు.
  • ఓరియంటల్ స్కూల్ వద్ద  టాయిలెట్స్ , ఆర్డీవో కార్యాలయం వద్ద గల టాక్ వద్ద, గడి వాటర్ ట్యాంక్ వద్ద టాయిలెట్స్ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందనీ,  శానిటేషన్ లో పిఎఫ్ అకౌంట్లో ఎవరి పేరు అయినా తప్పుగా నమోదైతే  పేర్లును  సరి చేస్తానని కమిషనర్  తెలియజేశారు. వాటర్ వర్క్స్  కమిటీ వేసినందుకుగాను కమిషనర్ రాజేందర్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలసి  పుష్పగుచ్చం అందించి, ఈఎస్ఐ హాస్పిటల్ బకాయి పడ్డ 24 నెలల ఈపీఎఫ్ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ చేయాలని, కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న ఆపరేటర్స్ కు ఎలక్ట్రిషన్ వాల్ ఆపరేటర్లు అండ్ టెక్నీషియన్లుగా కేటగిరిలో వారీగా జీతాలు పెంచి ఇవ్వాలని కమిషనర్ కు కోరడం జరిగిందన్నారు.

    ఈ సమస్యల పై  సానుకూలంగా  స్పందించిన కమిషనర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మహబూబ్ అలీ, వాటర్ వర్క్స్ అధ్యక్షులు  మీర్జాఅయ్యాజ్ బేగ్, ప్రధాన కార్యదర్శి పోతారాం ప్రభాకర్, కోశాధికారి ఎస్, నాగరాజు, ఉపాధ్యక్షులు కాట్రియాల ప్రభు, దీవెన, నడిపి నర్సవ్వ,  వై రాజు, శివ రాజవ్వ , బొకే జ్యోతి, సాయి, సలహాదారు అన్నేపల్లి శ్రీనివాస్, సభ్యులు, కంప్యూటర్, ఆపరేటర్స్ వరుణ్, మెగా సాయి,  ప్రవీణ్,  రాకేష్,  విజయ్, జ్యోతి సంజీవ్, ఆనంద్, తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -