తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులకు అండగా నిలుస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. బుధవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జానపద, ఉద్యమ కళాకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ వారసత్వ జానపద కళారూపాలను రేపటి తరాలకు అందిస్తున్న కళాకారులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించడం విచారకరమన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒగ్గు డోలు, కోలాటం, బుర్రకథ, ఒగ్గు కథ, చిందు యక్షగానం, బంజారా కడ్డి తంత్రి, కూన పులిపటం, శారద కథలు, హరికథ, గోండి, తోటి, ఆదివాసీ, కిన్నెర తదితర జానపద కళారూపాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక పాలసీ రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద సకల కలల పరిరక్షణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ దేశ్ పాండే, వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ కళాకారులకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES