Tuesday, July 15, 2025
E-PAPER
Homeవరంగల్మహిళలకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్ బాబు

మహిళలకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – – కాటారం : సెర్ప్ _డి ఆర్ డి ఏ,జయశంకర్ జిల్లా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమం లో భాగంగా ఈరోజు కాటారంలో జరిగిన నియోజకవర్గస్థాయి సంబరాలు కార్యక్రమంలో ఐటి ,ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని మహిళలు సంఘాల ద్వారా చేస్తున్నటువంటి పనులను ప్రశంసించి భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుటకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తదనంతరం సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్యకు అదేవిధంగా కాటారం, మహదేవపూర్, ముత్తారం, మలహర్రావు , పలిమల మండల సమాఖ్యలకు వడ్డీ లేని రుణాల చెక్కులను , బ్యాంకు రుణాల చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా మహదేవపూర్ మండలానికి రూ.15.56 లక్షల వడ్డీ లేని రుణాలను, రూ.70000 ఆర్టీసీ బస్సు ఈఎంఐ చెక్కును,5 సంఘాలకు రూ.2.28 లక్షల లోన్ బీమా చెక్కును,ఇద్దరూ నామినీలకు 20 లక్షల ప్రమాద బీమా చెక్కులను లబ్ధిదారులకు అందజేసినారు.సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన పలువురి మహిళలను సన్మానించినారు,అందులో భాగంగా మహదేవపూర్ మండలానికి చెందిన మసూదా బేగం, పద్మలను సన్మానించినారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ గారు, ఏ సి ఎల్ బీ శ్రీమతి విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్,ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,డి ఆర్ డి ఓ బాలకృష్ణ, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, ఐదు మండలాల సమాఖ్యల అధ్యక్షులు, సభ్యులు,ఆపరేటర్లు,ఎకౌంటెంట్లు వీవో ఏలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -