- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం చిన్న గుల్ల గ్రామానికి చెందిన బీఅర్ఎస్ నాయకులు వెంకట్ పటేల్ మాతృమూర్తి ఇటీవల కాలం చేశారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢసానుభూతిని ప్రకటించారు. ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దైర్యం కలగాలని దేవుడిని ప్రార్తించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎంపీపీ నీలు పటేల్, బొల్లి గంగాధర్, వేసారే రమేష్ పటేల్, రాజశేఖర్ పటేల్,రవి పటేల్, వెంకట్ గౌడ్, శివాజీ పటేల్, విజయ్ పటేల్, కిరణ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


