– ఉప్లూర్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పాఠశాల అభివృద్ధికి పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ పాఠశాలలో సమస్యల పరిష్కారం తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు పాఠశాలలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, పంచాయతీ పాలకవర్గ సభ్యులమంతా కలిసి చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత మార్కులు సాధించడం ద్వారా పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం సర్పంచ్ శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి రాజశేఖర్, వార్డు సభ్యులు జైరా బేగం సాదుల్లా, ఈభూది అనిల్, అవారి లక్ష్మీ సతీష్, ఆవారి సౌజన్య సంతోష్, ఆకుల రమ్య శేఖర్, కొమ్ముల సంతోష్, అవారి సురేష్, దాసరి రాకేష్, ఆరపేట అంజిత్, బైరగొని అజయ్, పూజారి లావణ్య వెంకట్ లను ఉపాధ్యాయులు శాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు సిరిమల్ల దేవన్న, సల్లూరి కిషన్ గౌడ్, మహికాంత్, రంగచారి, రవీందర్, గోపాల్, శ్రీనివాస్, చంద్రకళ, శ్రావణి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, శిరీష, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



