Friday, November 28, 2025
E-PAPER
Homeజాతీయంజ‌న‌వ‌రి 1న‌ లొంగిపోతాం: ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్

జ‌న‌వ‌రి 1న‌ లొంగిపోతాం: ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆప‌రేష‌న్ క‌గార్‌తో మావోయిష్టు ద‌ళాలు కుదేలువుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు రోజుల నుంచి టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల ఎన్‌కౌంటర్‌లో హిడ్మా తుదిశ్వాస విడిచారు. పలువురు త‌మ అనుచ‌రుల ద‌ళంతో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈక్ర‌మంలో మ‌రోసారి మావోయిష్టు స‌భ్యుల కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన లొంగిపోతామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయుధాల‌తో స‌హా స‌రెండ‌ర్ అవుతామ‌ని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదలైంది. కేంద్ర క‌మిటీ విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

మ‌రోవైపు వ‌చ్చే ఏడాది మార్చి 26లోపు మావోయిష్టు ముక్తా భార‌త్ చేయాల‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. ఈక్ర‌మంలోనే ఛ‌త్తీస్‌గ‌డ్, మ‌హారాష్ట్ర, ఒడిసా, తెలుగు రాష్ట్రాల‌తో పాటు అడ‌వులు, స‌రిహ‌ద్దుల్లో భారీగా బ‌ల‌గాలను మోహ‌రించింది. మావోయిష్టుల జాడ కోసం అడ‌వుల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నారు. ఆప‌రేష‌న్ క‌గార్‌తో టాప్ క‌మాండ‌ర్ల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎన్ కౌంట‌ర్ చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -