Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.. 

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.. 

- Advertisement -

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 
నవతెలంగాణ – భూపాలపల్లి
: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన  భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి మండలం వజినేపల్లి గ్రామంలో జరుగుతున్న భూ భారతి  రెవెన్యూ సదస్సును ఆకస్మిక తనిఖీ చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.  సదస్సుకు వచ్చిన  ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ … భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంపై ఏప్రిల్ మాసంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. అనంతరం రేగొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 3వ తేదీ 20వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.  వచ్చిన దరఖాస్తు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ  చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ రామస్వామి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img