స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే మూల సిద్ధాంతం
ఇప్పటివరకు ఒక లెక్క..తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరోలెక్క
ప్రజాపాలనకు రెండేండ్లు ప్రజలకు శుభాకాంక్షలు
ఆశీర్వదించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణను భారతదేశానికే గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటిం చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే మూల సిద్ధాంతాలుగా ముందుకెళ్తున్నట్టు స్పష్టం చేశారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యముండాలనీ, గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సరిగ్గా రెండేండ్ల క్రితం తనకు ఆ ధైర్యం ఇచ్చి, తమ ఓటుతో గెలుపించి, నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రెండేండ్లలో తెలంగాణను అన్ని రాష్ట్రాల్లో శిఖరాగ్రాన నిలిపేందుకు అనునిత్యం శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు.
”గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతిచ్చి అదానీ, అంబానీల లెక్క వ్యాపారర ంగంలో నిలిపాం. బలహీనవర్గాల వందేండ్ల ఆకాంక్షలను కులగణనతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకతను ఇచ్చాం. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. ”జయ జయహే తెలంగాణ” అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు…..” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతమని తాము సరిపెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేండ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలనే విషయమై లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేసినట్టు వెల్లడించారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు తాము ప్రాణం పోసినట్టు ఆయన వెల్లడించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇప్పటి వరకు ఒక లెక్క ”తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క అని పేర్కొన్నారు. నిన్న, నేడు, రేపు..ఎప్పుడైనా ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధమనీ, వారి ప్రేమాభిమానాలే తనకు సర్వమనీ, వారి సహకారమే తనకు సమస్తమని తెలిపారు. తెలంగాణ తనకు తోడుగా ఉన్నంత వరకు, తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రాన్ని గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



