Friday, November 7, 2025
E-PAPER
Homeబీజినెస్నగరంలో 'వేర్‌మాట్' ఎక్స్‌పో ప్రారంభం

నగరంలో ‘వేర్‌మాట్’ ఎక్స్‌పో ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ -‍‌‍‌ హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో గిడ్డంగులు, లాజిస్టిక్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ రంగాల్లో వ్యాపార అవకాశాలు, పరిశ్రమ భాగస్వామ్యాలను ఒక వేదిక పైకి తీసుకురావడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ‘వేర్‌మాట్ 2025’ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మిడాస్ టచ్ ఈవెంట్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ డైరెక్టర్ డీ వివేకానందన్ మాట్లాడుతూ వేర్వేరు రంగాల పరిశ్రమలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘వేర్‌మాట్’ (వేర్‌మాట్ – వేర్ హౌసింగ్, మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్స్‌పో) 6వ ఎడిషన్ ఈరోజు ప్రారంభించామని, 9వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. కోయంబత్తూరు, చెన్నైల్లో అత్యంత విజయవంతంగా ఐదు ఎడిషన్లు నిర్వహించిన తర్వాత ఈసారి పారిశ్రామికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మొదటిసారి నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఆగస్టు 2025లో కోయంబత్తూర్లో జరిగిన ఎడిషన్‌కు పది వేల మందికి పైగా సందర్శకులు, 125 ఎగ్జిబిటర్లు హాజరయ్యారన్నారు. ఈ ప్రదర్శనలో నీల్‌కమల్, కియోన్, టీవీఎస్, లుగాంగ్, జుంగ్‌హేయిన్‌రిచి, హాల్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఫోర్లిఫ్ట్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు కూడా నిర్వహించాయని తెలిపారు.

సప్లై చైన్, గిడ్డంగులు, లాజిస్టిక్స్, స్టోరేజ్ రంగాల్లో పెరుగుతున్న పెద్ద మార్కెట్లను ఇంకా ఎవరూ పూర్తిగా అన్వేషించలేదన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకునే సమయం వచ్చిందన్నారు. అందుకే హైదరాబాద్‌ వచ్చామన్నారు. హైదరాబాద్ ప్రస్తుతం కృత్రిమ మేధ, ఆటోమేషన్, స్మార్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ టెక్నాలజీలను అర్థం చేసుకుంటూ, స్టోరేజ్ స్పేస్ ఆప్టిమైజేషన్ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ ఎక్స్‌పో ఎంఎస్ఎంఈ, స్థానిక పరిశ్రమలకు, ప్రాంతీయ మార్కెట్ ఎదుగుదలకు మద్దతు అందిస్తుందని తెలిపారు.
ఈసారి చార్మినార్ నగరంలో జరుగుతున్న వేర్‌మాట్ ఎక్స్‌పోకు ఆరు వేల మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. సుమారు 200 కంపెనీలు దేశీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. కొనుగోలు, అమ్మకాల పరంగా కొత్త వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎక్స్‌పోలో వ్యాపార యజమానులు, ప్రొక్యూర్‌మెంట్ నిపుణులు, లాజిస్టిక్స్ మేనేజర్లు, పరిశ్రమ నిర్ణయాధికారులు వేలాది మంది అర్హత కలిగిన సందర్శకులను కలుసుకునే అవకాశం ఉందన్నారు. గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగానికి చెందిన వారు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించుకునే ఒక వేదికగా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ ఎక్స్‌పోలో వందకు పైగా ప్రదర్శకులు ఈ క్రింది విభాగాల్లో తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. అవి.. గిడ్డంగుల నిర్వహణ, స్టోరేజ్ సొల్యూషన్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు, లాజిస్టిక్స్, సప్లై చైన్ టెక్నాలజీలు, రవాణా, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు ఉన్నాయన్నారు. అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్, స్మార్ట్ వేర్‌హౌస్ సొల్యూషన్స్ లైవ్ డెమోస్, దేశవ్యాప్తంగా వచ్చిన బయర్స్, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొక్యూర్‌మెంట్ హెడ్‌లతో బీ2బీ నెట్‌వర్కింగ్ అవకాశాలు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాల్లో కొత్త ధోరణులు, సాంకేతిక పరిణామాలపై జ్ఞాన మార్పిడి సెషన్‌లు కలవన్నారు. భారతదేశంలో ప్రధాన లాజిస్టిక్స్, గిడ్డంగుల హబ్‌గా హైదరాబాద్ వేగంగా ఎదుగుతుందన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా కొత్త మార్కెట్లను పరిశీలించటం, వ్యాపార భాగస్వామ్యాలు నిర్మించటం, ఉత్పాదకత, సామర్థ్యాలు, వృద్ధిని పెంచే ఆధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రత్యక్షంగా అనుభవించటం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రధాన విభాగాలు.. గిడ్డంగుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలు, స్టోరేజ్ & ర్యాకింగ్ సొల్యూషన్స్, లాజిస్టిక్స్ ఆటోమేషన్ & రోబోటిక్స్, ఇంట్రాలాజిస్టిక్స్, స్మార్ట్ ఇన్నోవేషన్స్, గిడ్డంగుల డెవలపర్లు, ప్యాకేజింగ్ & లేబెలింగ్ ఫర్ లాజిస్టిక్స్, సప్లై చైన్ భద్రత, రక్షణ, ఇండస్ట్రియల్ జన్సెట్లు & పవర్ సొల్యూషన్స్, కమర్షియల్ వాహనాలు & రవాణా వ్యవస్థలు కలవన్నారు. ఈ ఎక్స్‌పోకు రావాల్సిన ప్రధాన పరిశ్రమలు, వృత్తి వర్గాలు ఏమిటంటే, గిడ్డంగుల నిర్వాహకులు, 3పీఎల్, 4పీఎల్, 5పీఎల్, లాజిస్టిక్స్ సంస్థలు, రిటైల్, ఈ-కామర్స్ ప్రొక్యూర్‌మెంట్ హెడ్‌లు, తయారీ సంస్థలు, ఎంఎస్ఎంఈలు, ఇన్‌ఫ్రా కన్సల్టెంట్లు, కోల్డ్ చైన్ & రిఫ్రిజిరేటెడ్ లాజిస్టిక్స్, ప్రభుత్వ సంస్థలు, ప్రణాళికాధికారులు, ఆర్కిటెక్టులు, కన్సల్టెంట్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఆటోమొబైల్, ఆటో పార్ట్స్ పరిశ్రమ, కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్, ఫ్రైట్ సర్వీస్ కంపెనీలు, కార్గో, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, పోర్టులు, రైల్వేలు, విమానాశ్రయ లాజిస్టిక్స్ సంస్థలు, సప్లై చైన్ నిర్వహణ సంస్థలు అన్నారు.

హైదరాబాద్ నగరం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రపంచ స్థాయి ఈ-కామర్స్ సంస్థల ప్రధాన కార్యకలాపాల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ‌దీంతో అధునాతన గిడ్డంగులు, లాజిస్టిక్స్, సప్లై చైన్ సేవలకు డిమాండ్ ఏర్పడిందన్నారు. నగరం ఫార్మా, ఐటీ రంగాలు భారీ స్థాయిలో సప్లై చైన్ సేవలపై ఆధారపడుతున్నాయన్నారు.‌ దీని కారణంగా మెటీరియల్ హ్యాండ్లింగ్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ సొల్యూషన్లకు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్, దక్షిణ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ మార్కెట్‌కు ప్రధాన గేట్వేగా పని చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఒరాకిల్ వంటి ప్రసిద్ధమైన ఐటీ దిగ్గజాల ప్రధాన కార్యాలయాలు, ఆర్&డీ కేంద్రాలు ఉన్నాయన్నారు. దీంతో స్మార్ట్ వేర్‌హౌసింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్, కృత్రిమ మేధ ఆధారిత సప్లై చైన్ పరిష్కారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ టాప్ రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందని తెలిపారు. తక్కువ బ్యూరోక్రసీ, సౌకర్యవంతమైన విధానాలు, పెట్టుబడులకు అనుకూలమైన ఆర్థిక వాతావరణం ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదన్నారు. నగరంలోని అన్ని పరిశ్రమ కేంద్రాలకు సులభమైన రహదారి, రైలు అనుసంధానం ఈ నగరాన్ని పారిశ్రామిక కార్యకలాపాలకు, గిడ్డంగుల అభివృద్ధికి అనువైన కేంద్రంగా నిలబెట్టాయని తెలిపారు. ‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -