Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం ఎఫెక్ట్..పలు విమానాలు దారి మ‌ళ్లింపు

హైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం ఎఫెక్ట్..పలు విమానాలు దారి మ‌ళ్లింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img