Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపెళ్లి వ్యాన్ బోల్తా.. 11 మందికి గాయాలు

పెళ్లి వ్యాన్ బోల్తా.. 11 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీసస్టేషన్ పరిధిలోని మిట్టాపల్లి గ్రామశివారులో గురువారం సాయంత్రం పెళ్లి వ్యాన్ బోల్తా పడిన ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన సాట్ల అనిల్ కు నిజామాబాద్ మండలం ఆర్సపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో గురువారం ఉదయం పెళ్లి వేడుకలు ముగించుకుని సాయంత్రం తిరుగు ప్రయాణంలో మిట్టాపల్లి గ్రామశివారులోని మహాలక్ష్మీ ఆలయం టర్నింగ్ వద్ద డీసీయం వ్యాన్ ప్రమాదవశాత్తు పక్కనున్న పంట పొలాలకు దూసుకెళ్లింది. వ్యాన్లో సుమారు 100 మంది వరకు ఉన్నారు.

అందులో భగీరథ, వేణు, చంద్రయ్య, రాజయ్య, అనిల్ తోపాటు మొత్తం 11 మందికి గాయాలయ్యాయని ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఘటనా స్థలానికి  చేరుకుని పంట పొలాల్లో ఉన్న వ్యాన్ను పక్కకు తొలగించి గాయపడిన వారందరికి 108 లో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి బలమైన గాయాలయ్యాయని  వివరించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పంట పొలాల్లో కాక వేరే ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి మిట్టాపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు హుటాహుటిన తరలి వచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad