Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏ పంటలోనైనా కలుపు యాజమాన్యం ఎంతో ముఖ్యం

ఏ పంటలోనైనా కలుపు యాజమాన్యం ఎంతో ముఖ్యం

- Advertisement -

కామారెడ్డి ఏడిఏ అపర్ణ
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి డివిజన్లో వరి పంటను  80,000  ఎకరాలలో సాగు చేస్తారనీ కామారెడ్డి ఏ డి ఏ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏ పంటలోనైనా కలుపు యాజమాన్యం ఎంతో ముఖ్యము అని,  50 నుంచి 60 శాతం దిగుబడి అనేది కలుపు యాజమాన్యం మీదనే ఆధారపడి ఉంటుంది. వరి నారు పెంచిన తర్వాత పొలంలో నాటు వేసినప్పుడు మనము కలుపు యాజమాన్యం గురించి ఆ ప్రకటనలో వివరించారు.

ప్రధానంగా వరి పంటలో తుంగ జాతి మొక్కలు, గడ్డి జాతి మొక్కలు, వెడల్పాకు మొక్కలు ఎక్కువగా వరిలో ప్రధాన పంటతో పోటీపడి దాని దిగుబడిని 50 నుంచి 40 శాతం వరకు నష్టం కలగజేస్తాయి. కలుపు మొక్కలు ప్రధాన పంట వారితో సూర్యరశ్మి  పోషకాలు నీటి కోసం పోటీపడి దిగుబడి మీద ఎక్కువగా దెబ్బతీస్తాయి. ఈ కలుపు జాతి మొక్కలు వివిధ రకాల శిలీంద్రాలు లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగుళ్ళకు గాని ఇతర కీటకాల కు గాని హోస్ట్ ప్లాంట్ గా ఉండి దిగుబడి మీద దెబ్బతీస్తాయి. 

ప్రధానంగా నాటు పెట్టక ముందే గట్ల మీద  మనం వివిధ రకాలైన కలుపు మొక్కలు అయినా వయ్యారిభామ, వివిధ గడ్డి జాతి మొక్కలు పంటకు చేటు చేస్తాయి, రైతులు నాటు పెట్టకమునుపే గట్లను చెక్కేసి వాటిపైన నాన్ సెలెక్టివ్ కలుపు మందులైన గ్లూఫోసేట్ అమోనియం 5 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి లేదా ప్యారా క్వాట్ 5 మీ ల్లీ, లీటర్ నీటికి కలిపి గట్లపైన పిచికారి చేయాలి, ఈ మందులు ప్రధాన పొలం మీద పడకుండా గట్లపైనే జాగ్రత్తగా స్ప్రేయర్ కుడ్ అనే పరికరం ఉపయోగించి గట్ల మీద కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారి చేయాలి జాగ్రత్తగా ఈ విషయాలపై రైతులు  అవగాహన కలిగి ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -