– హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్టాఫ్ నర్సుల పోస్ట్ పరీక్షలకు హాజరైన వాళ్లలో కోర్టుకు వచ్చిన 11 మంది అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు కలపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెయిటేజ్ మార్కులు కలిపిన అనంతరం పిటిషనర్లు ఉద్యోగాల భర్తీకి అర్హత సాధిస్తే గతంలో ఆదేశించిన మేరకు ఖాళీగా ఉంచి 11 పోస్టుల్లో వాళ్లను నియమించాలని సూచించింది. స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయకుండా 11 పోస్టులను ఖాళీగా ఉంచాలని గత జనవరిలో మధ్యంతర ఆదేశాలను జారీ చేశామని పేర్కొంది. వెయిటేజ్ మార్కులు కలిపాక పిటిషనర్లు అర్హత పొందితే వాళ్లను ఆ పోస్టుల్లో నియమించాలని వైద్య, ఆరోగ్య సర్వీసెస్ నియామక బోర్డును ఆదేశించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఓఎంఆర్ విధానానికి బదులు కంప్యూటరీకరణ ద్వారా పరీక్ష పెట్టి పోస్టుల భర్తీ ప్రక్రియను నిర్మల మరో 11 మంది వేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్. రాజేశ్వరరావు ఇటీవల తుది ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్లపై విచారణను క్లోజ్ చేశారు.
ఏం చర్యలు తీసుకునేదీ చెప్పండి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్, గైరాన్ భూములను ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు, వాళ్ల కుటుంబసభ్యుల పేరిట రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేయాలని ఈడీ పోలీసులకు రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు ఏం తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేఖ ఆధారంగా పోలీసులు ఏం చేయబోతున్నారో తదుపరి విచారణ నాటికి తెలియజేయాలంది.విచారణ నవంబర్ మూడో తేదీకి వాయిదా వేసింది. సర్వే నెంబర్ 181లోని కొంత భూమిపై యాజమాన్య హక్కు ఉందని దస్తగిర్ షరీఫ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారించారు. ఆరో పణలు ఎదుర్కొంటున్న వారంతా ప్రభుత్వంలో ఉన్న తాధికారులుగా ఉన్నారనీ, తప్పుడు పత్రాలు, ఫోర్జరీలతో భూదాన్ బోర్డు భూమిని కాజేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషనర్ వాదన. ఈడీ లేఖపై పోలీసులు ఏం చేయబోయేదీ తెలు సుకుని వివరాలు చెప్పేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
ఆ 11 మంది అభ్యర్థులకు వెయిటేజీ మార్కులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



