– వేల్పూర్ మండల వ్యవసాయ అధికారిని శృతి
– సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రైతులు సాగునీటి ఆదా కోసం తడి-పొడి విధానాన్ని పాటించాలని మండల వ్యవసాయ అధికారిని శృతి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో మంగళవారం సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి సాగులో పాటించాల్సిన మెలకువలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎరువుల యాజమాన్యంపై మండల వ్యవసాయ అధికారిని ఎస్.శృతి రైతులకు వివరించారు. అనంతరం ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం పథకం కింద వానకాలం సీజన్ లో గ్రామానికి చెందిన హెడ్మాల సురేందర్ రెడ్డి సాగు చేస్తున్న ఆర్.డి.ఆర్-1200 రకం వరి క్షేత్రాన్ని మండల వ్యవసాయ అధికారిని శృతి ఆధ్వర్యంలో పలువురు రైతులు క్షేత్ర సందర్శన చేశారు.
సాగు నీటిని ఆదా చేసేందుకు వరిలో (తడి- పొడి) సాగు విధానంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సాగు పద్ధతిని రైతులందరూ పాటించి సాగునీటిని వృధా కాకుండా చేసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా వరిలో కలుపు తొలగించుకున్న తర్వాత పొట్ట దశ వరకు ఉన్న సమయంలో ఎక్కువ నీరు అవసరం ఉండదని, కాబట్టి రైతులు తడి-పొడి విధానాన్ని పాటించాలని వ్యవసాయ అధికారిని శృతి తెలిపారు.కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాం రాజు, సుస్థిర వ్యవసాయం మండల కోఆర్డినేటర్ చింత శ్రీనివాస్, హరీష్ సిసింద్రీ, శ్రీనివాస్, మహేష్, సంతోష్, సుభాష్, గంగాధర్, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి ఆదా కోసం తడి-పొడి విధానాన్ని పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES