ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తహసిల్దార్..
నవతెలంగాణ – రెంజల్
మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఒక గంటలో తమ ధాన్యం తరలిస్తామన్న రైతన్నల ఆశలు అడియాశలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక తహసిల్దార్ శ్రవణ్ కుమార్ సంఘటన స్థలానికి విచ్చేసి పరిశీలించారు. గత రెండు మూడు సంవత్సరాలుగా రైతులకు వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు కాల్చి వస్తుంది. గత సంవత్సరం పొగాకు పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లగా.. రైతులు సోయ పంటను వేయగా అట్టి పంట నీట మునిగి రైతులకు దెబ్బ మీద దెబ్బ పడితే అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని వారి కోరుతున్నారు.
తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతాంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


