Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి 

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి 

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల 
నవతెలంగాణ – నకిరేకల్

భారీ వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని తాటికల్, మంగళపల్లి గ్రామాలలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెట్టిన తర్వాత భారీ వర్షాలు వచ్చి దాన్యం తడిసి ముద్దయిందన్నారు.

దీంతో ధాన్యం మొలకలు కూడా వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితులలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం వల్ల రైతులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలతో మిల్లులకు పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు తరుగు తీస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మిల్లర్లతో చర్చించి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని షరతులు లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు చెన్నబోయిన నాగమణి, సాకుంట్ల  నరసింహ, బండమీది ఎల్లయ్య, కొప్పుల అంజయ్య, కాడింగు  యాదయ్య, పైళ్ల లింగయ్య, దోరేపల్లి రాములు , ధర్మపురి, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -