Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డుమ్మా టీచర్ పై చర్యలేవి.?

డుమ్మా టీచర్ పై చర్యలేవి.?

- Advertisement -

జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంలో అంతర్యమేమిటో.?
అమ్యామ్యాలకు తలొగ్గడమేనా.?
బిల్డర్ అనే భయమా.?
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం పెద్దతూండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా మ్యాచువల్ ట్రాన్స్ పర్ భాగంగా జాయినింగ్ అయ్యి సెలవుల్లో వేతనం పొందుతూ.. ప్రభుత్వ వర్కింగ్ రోజుల్లో లాంగ్ లివ్ పెడుతూ.. తన స్థానంలో వేకెన్సీ పోస్టు ఖాళీ లేకుండా చాకచక్యంగ వ్యవహరిస్తు తన ఉద్యోగాన్ని కాపాడుకుంటూ అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులను మోసం చేస్తున్న పిన్నింటి వేంకటేశ్వర్ రావుపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతను లాంగ్ లివ్ పెట్టడం ద్వారా విద్యార్థులకు నష్టం జరుగుతున్న పట్టించుకునేవారు కరువైయ్యారు. ఉపాధ్యాయ వృత్తికి ఎగనామం పెట్టి వరంగల్ పట్టణంలో రియల్ ఎస్టేట్,బిల్లర్ తదితర వ్యాపారులు చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పిన్నింటి బాగోతమంతా జిల్లా విద్యాశాఖ అధికారుల కనుసైగలోనే నడవడంతోనే చర్యలు తీసుకోవడానికి వెనుకముందు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.దాదాపు మూడు సంవత్సరాలుగా విధులకు డుమ్మా కొడుతున్న అతడు ఒక బిల్డర్ అనే భయంతోనే చర్యలకు వేణుకాడుతున్నారా…లేదా…అతడు ఇచ్చే అమ్యామ్యాలకు తలొగ్గరా…అనేది అంతుచిక్కని ప్రశ్న.ఈ డుమ్మా ఉపాధ్యాయునీపై పూర్తి సమాచారం కోసం నవ తెలంగాణ పెద్దతూoడ్ల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి, మండల ఎంఈఓ లక్ష్మన్ బాబులను వివరణ కోరగా..ఇంగ్లీష్ ఉపాధ్యాయుని చిట్టా అంతా జిల్లా విద్యాశాఖ అధికారికి పంపినట్లుగా తెలిపారు.జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -