Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీవన్‌ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసింది?

జీవన్‌ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసింది?

- Advertisement -

– కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని ఎదిగారు తప్ప కార్యకర్తలకు చేసిందేమీ లేదు :పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం
నవతెలంగాణ-కరీంనగర్‌

మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ ఏం తక్కువ చేసిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 ఏండ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌ రెడ్డికి 14 సార్లు ఎమ్మెల్యే టికెట్‌, మూడుసార్లు ఎంపీ టికెట్‌, రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఇంతగా లబ్దిపొందిన ఆయన పార్టీకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు కనీసం నామినేటెడ్‌ పదవులు కూడా ఇప్పించలేదని విమర్శించారు. జగిత్యాలలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదుగనివ్వలేదన్నారు. తాను మీడియాను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమం వరకు మీడియా తనకు ఎంతో సహకరించిందని, మీడియాను తాను కన్నతల్లిలా భావిస్తానని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తన మాటల వల్ల నొచ్చుకుంటే క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు సముద్రాల అజరు, గడ్డం నాగరాజు, సుద్దాల లక్ష్మణ్‌, ఆవాల లత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -