‘బకాసుర రెస్టారెంట్’ అనేది కొత్త జోనర్‌తో పాటు ఓ ప్రయోగాత్మక కమర్షియల్ సినిమా. ఇంతకు ముందు వచ్చిన ‘యమలీల, ఘటోత్కచుడులా’ ఆడియన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే కథ. ఇలాంటి కొత్త కథలనే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు ఎస్‌జే శివ అన్నారు.
హాస్యనటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం దర్శకుడు ఎస్‌జే శివ మీడియాతో ముచ్చటించారు.
నేను లండన్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశాను. ‘విరూపాక్ష’ చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాను. ఇక గతంలో మా నాన్న కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన కోరిక, కల తీర్చడం కోసమే నేను దర్శకుడిగా, మా అన్నయ్య నిర్మాతగా మారాం.
మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే, ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది కథ. సినిమా మొత్తం కంప్లీట్ ప్యాకేజీలా ఉంటుంది. హర్రర్ థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్ అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు తెలుగులో చాలా జోనర్‌లు వచ్చాయి. ఇదొక కొత్త జోనర్. మా సినిమాతోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇదొక తిండిబోతు కథ. దానిని నుంచి వచ్చే కామెడీ కాబట్టి హంగర్ కామెడీ అంటున్నాం.
ఐదుగురు బ్యాచిలర్స్ మధ్య జరిగే కామెడీ కథ ఇది. ఈ కథ వినగానే హీరోగా తాను చేస్తానని ప్రవీణ్ చెప్పారు. శిరీష్ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా కథ గురించి ఆయన మాతో గంటసేపు డిస్కషన్ చేశారు. దిల్‌రాజు కూడా బాగుందని అభినందించారు. ఎస్వీసీ లాంటి గొప్ప సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది.
మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే?
- Advertisement -
- Advertisement -