Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమామొహమాటం ఎక్కువైతే?

మొహమాటం ఎక్కువైతే?

- Advertisement -

కేఎస్‌ ఫిలిం వర్క్స్‌ బ్యానర్‌ పై రోహన్‌, రిదా జంటగా నటించిన చిత్రం ‘గప్‌ చుప్‌ గణేశా’.
సూరి ఎస్‌ దర్శకత్వంలో కేఎస్‌ హేమ్రాజ్‌ నిర్మిస్తున్నారు.
వినాయక చవితి పండగ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌ ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టైటిల్‌ చాలా బాగుంది. చాలా క్యాచీగా ఉంది. గతంలో కూడా కేఎస్‌ ఫిలిం వర్క్స్‌ బ్యానర్‌లో ‘రిచ్చిగాడి పెళ్లి’ అనే చిత్రం హేమ్రాజ్‌ దర్శకత్వంలో విడుదలై, మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు.
”మా చిత్ర ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌ లాంచ్‌ చేసిన దామోదర ప్రసాద్‌కి కతజ్ఞతలు. ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత హేమ్రాజ్‌ చెప్పారు.
దర్శకుడు సూరి ఎస్‌ మాట్లాడుతూ, ‘ఒక మొహమాట స్తుడైన వ్యక్తి తన మొహమాటం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతాడనేది ఆద్యంతం హస్య భరితంగా చూపించాం. ఈ కథ ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో ఆహ్లాదంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు యువతను కట్టిపడేస్తాయి. అయితే దీనికి ‘గప్‌ చుప్‌ గణేశా’ అనే టైటిల్‌ని ఎందుకు పెట్టామనేది మాటల్లో కంటే, వెండితెరపై చూస్తే థ్రిల్‌ ఫీల్‌ అవుతారు’ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad