కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిన ప్రజలు
10 ఏండ్లలో తెలంగాణను నెంబర్ వన్ చేశాం
అందుకే మళ్లీ బీఆర్‌ఎస్ అంటున్న జనం : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలకులే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటే రాష్ట్రం ఎలా అభివద్ధి చెందుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. లండన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలం గాణను నెంబర్ వన్‌గా మార్చామని తెలిపారు. అంతకుముందు దేశంలో బెంగాల్ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది అనే నానుడి ఉండేదనీ, బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంది…దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తీసుకొచ్చినట్టు తెలిపారు. పర్ క్యాపిటా ఇన్‌కమ్, పర్ క్యాపిటీ పవర్, జీఎస్డీపీ గ్రోత్, ప్రతి ఇంటికి నల్లా నీరు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, మిషన్ కాకతీయతో 3 సంవత్సరాల్లో 30 వేల చెరువులను నింపినట్టు హరీశ్ రావు తెలిపారు.
మిషన్ భగీరథ అధ్యయనానికి కేంద్రం రాష్ట్రానికి అధికారులను పంపించిందని గుర్తుచేశారు. రైతుల కోసం దేశంలోనే నగదు బదిలీ చేసి, ప్రతి ఏటా రూ.10 వేలు ఇన్‌ఫుట్ సబ్సిడీ, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, 7.7 శాతం గ్రీన్ కవరేజీని పెంచిందని తెలిపారు. మాతా, శిశు మరణాలను తగ్గించి దేశంలో మూడో స్థానానికి వచ్చామనీ, బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే ఆ విషయంలోనూ నెంబర్ వన్ స్థానానికి రాష్ట్రం వచ్చేదన్నారు. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారనీ, ఆ మేరకు రూ.7 వేల కోట్లతో టెండర్లు పిలిచారని హరీశ్ రావు తెలిపారు. మల్లన్నసాగర్ మునిగిపోయేదే అయితే కాళేశ్వరం నీళ్లను మూసీకి ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన గంధమల్ల ప్రాజెక్టుకు సోర్స్ కాళేశ్వరమే అని హరీశ్ రావు స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రయత్నాల వల్లే ఇప్పటికీ తెలంగాణలో అధిక పంట పండుతుందని తెలిపారు. రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లలో మరమ్మతులు అయిపోయే మేడిగడ్డకు రూ.ఒక లక్ష కోట్ల దుర్వినియోగమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బతినేలా రాజకీయం చేయొద్దని హితవు పలికారు.
ఇంకా బాగా చేస్తారనీ….
బీఆర్‌ఎస్ పాలన బాగుందని ప్రజలకు తెలుసని హరీశ్ రావు తెలిపారు. అయితే బీఆర్‌ఎస్ కన్నా ఇంకా బాగా చేస్తారన్న ఆశతో కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. కళ్యాణలక్ష్మికి రూ.ఒక లక్షతో పాటు తులం బంగారంతో పాటు అనేక హామీలనిచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో చాలా ఇబ్బందులు, కష్టాలు పడుతూ అప్పుల పాలైన పంచాయతీ కార్యదర్శులు తనతో ఈ విషయాలు పంచుకున్నారని హరీశ్ రావు వెల్లడించారు.
పాలకులే నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉంటే ఎలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES