Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి..? ఆపేరు పెట్టడానికి కారణం ఇదే

‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి..? ఆపేరు పెట్టడానికి కారణం ఇదే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో… భార‌త్ విరుచుకుపడుతోంది. ఈ దెబ్బకు ఇప్పటికే 80 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హ‌తం అయిన‌ట్లు స‌మాచారం. అటు పాకిస్తాన్లో అప్రకటిత ఎమర్జెన్సీ కూడా ప్రకటించేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది.
మొన్న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో… పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇండియాకు తలభాగం అయిన జమ్ము కాశ్మీర్ పైన పాకిస్తాన్ దాడి చేసిందని.. ఇండియా భావిస్తోంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్, పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. దీనికి పెట్టిన పేరులోనే పాక్‌కు ఓ సందేశం ఉంది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు చంపిన వారిలో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధువరులు ఉన్నారు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అర్థం కూడా దీనిలో ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad