భారత స్థూల జాతీయోత్పత్తిని చూపిస్తూ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తున్నామనే ప్రధాని మోడీ ప్రచార రంగును రూపాయి బయటపెట్టింది. కొంతకాలంగా పతనదిశగా సాగుతున్న రూపీ విలువ డాలర్‌కు తొంభై రూపాయలు చెల్లించాల్సిన స్థితికి కోల్పోయింది. ఇంత దారుణంగా రూపాయి చిక్కి శల్యమవుతుంటే మన యాభై ఆరు ఇంచుల ఛాతీ గల ‘విశ్వగురు’ ఏం చేస్తున్నట్టు? అది క్షీణించకుండా చూడాలి కదా. ‘నేపాల్‌లో రూపాయి పడిపోలేదు, బంగ్లాదేశ్‌లో పడిపోలేదు, శ్రీలంకలో కూడా పడిపోలేదు. భారత్‌లో మాత్రం రూపాయి ఎందుకు పడిపోయింది’ అంటూ 2013లో ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీపై గగ్గోలు పెట్టిన ‘దేశ్‌కి నేత’ ఇప్పుడు మాట్లాడరేం? ‘మన ప్రధాని బలహీన మైన ప్రధాని’ అంటూ ‘మౌనముని మన్మోహన్’ అంటూ విరుచుకుపడిన నాయకుడు ఏం చేస్తున్నట్టు? అంతర్జాతీ యంగా డాలర్‌కు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ట్రంప్ టారిఫ్‌ల వార్‌తో దూసుకుపోతున్నాడు. ఇక్కడ మాత్రం రూపాయి పడిపోయినా అదే అమెరికాకు మోకరిల్లే విధానాల్ని మోడీ అవలంభిస్తు న్నాడు. ముడి చమురు రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి కొనుగోలు చేయడం ఎవరి ప్రయోజనాల కోసం? దేశ ఆర్థికాన్ని దిగుమతులపై ఆధారపడేలా చేసిన నయా,ఉదార వాద విధానాలే ఫలితమే దీనికి మూలం. బాధ్యత వహిం చాల్సింది ఎవరు? వాటిని అమలు చేసేవారే కదా?
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ డిమాండ్ పెరగడమంటే మన దేశ రూపాయి విలువ ఇతర దేశాల ద్రవ్యాలకంటే బాగా తగ్గిపోవడం. నిన్న ఒక డాలర్ కొనడానికి మనం ఎనభై ఐదు రూపాయలు వెచ్చిస్తే, నేడు అది తొంభైకి పెరిగితే రూపాయి బలహీనపడినట్టే లెక్క. ఇది నేరుగా దేశ ప్రజానీకంపై ప్రభావం చూపే పరిణామం. ఎందుకంటే, మనదేశ అవసరాల్లో ఎనభైశాతం ముడి చమురును విదేశాల నుండి డాలర్ రూపం లోనే మోడీ సర్కార్ కొనుగోలు చేస్తున్నది. అలాగే వంటనూనె కూడా. రూపాయి విలువ తగ్గితే చమురుకు మనం మరింత రేటు కట్టివ్వాలి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనివార్యం! అలాగే విదేశాల నుండి దిగుమతి చేసుకునే సరుకుల ధరలు కూడా ప్రియమవుతాయి. ఏది కొన్నా ఎక్కువధర చెల్లించాలి. ఇది అటో మేటిక్‌గా అన్ని రంగాలమీద పడే ప్రభావం. రవాణా ఖర్చులు పెరిగి పాలు, కూరగాయలు, బియ్యం, నిర్మాణ సామగ్రి, రోజూ వాడే నిత్యావసర సరుకులన్నింటిపై దీని ధరా భారం ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో చదువు కునే మన భారతీయ విద్యార్థులు దీన్ని ప్రత్య క్షంగా అనుభవిస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకును సంప్రదించి ఆర్థిక సమీక్షలు చేసి కరెన్సీ పడిపోకుండా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన మన ప్రధాని రాజ్‌భవన్‌ల, ప్రధాన మంత్రి కార్యాలయం పేర్ల మార్పులో బిజీగా ఉన్నారు. పైగా రూపాయి పతనానికి ‘ప్రపంచ పరిస్థి తుల ప్రభావం’ కారణమని తప్పించుకుంటున్నారు.
ఆయన ఛాతీ ముందుకు కదలకపోవడానికి నష్టం జరిగేది కార్పొరేట్లకు కాదు కదా! వేతన కార్మికులు, చిన్న వ్యాపారులు, కూలీలు, రైతులకు. దీని వల్ల హౌసింగ్, పర్సనల్, ఎడ్యుకేషన్‌లోన్ కూడా ఖరీదుగా మారుతుంది, ఈఎంఐ పెరుగుతుంది. పేదరికంలో ఉన్నవారు మరింత దారిద్య్రంలో కూరుకుపోతారు. కనీసం తినడానికి తిండి కూడా దొరికే పరిస్థితి ఉండదు. దీని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం మోడీకే చెల్లింది. పైగా నిటి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ లాంటివారు ‘ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం ఆర్థిక వ్యవస్థకు మంచిదే’ అన్నారు. ఇలా ంటి కనీస జ్ఞానం లేని వారు దేశాన్ని పాలిస్తుంటే వారి అజ్ఞానానికి నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియడం లేదు. మళ్లీ ఇదంతా మన జనానికే భారం తప్ప, సంపన్నులకు పోయేదేమీ ఉండదు. పైగా వారి ఆస్తి రెట్టింపు అవుతుంది. ఎందుకంటే, వారి సంపదంతా కూడా బంగారం, విదేశాల్లో పెట్టుబడులు, డాలర్లలో ఆస్తులు, రియల్ ఎస్టేట్‌లో ఉంటాయి. పైగా రూపాయి క్షీణిస్తే బం గారం ధర కూడా పెరుగుతుంది. మన దేశంలోకి బంగారం దిగుమతులు గత ఐదునెలల్లో మూడు రెట్లు పెరగడం సంప న్నుల ధన ప్రవాహాన్ని సూచిస్తున్నది. అదే సమయంలో ట్రంప్ సుంకాల వల్ల అమెరికాకు మన ఎగు మతులు ఇరవై ఎనిమిది శాతం పడిపోవడం మన ఆర్థిక బలహీనతను గోచరిస్తుంది.
ఆర్థిక వ్యవస్థలో ఎదురయ్యే ప్రతీ సంక్షోభానికి సామా న్యులు సమిధలవ్వడం కొత్తేమి కాదు. రూపాయి విలువ పడి పోవడం కూడా పాత కథే. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరు కుపోతుందంటే కంపించేది బహుళజాతి కంపెనీల కుర్చీలు కాదు, రేషన్ దుకాణం ముందు నిలబడే పేదోడి కాలి కండ రాలే. ఇలాంటి సమయంలోనే పబ్లిక్ రంగాన్ని బలోపేతం చేయాలి, ప్రజల కొనుగోలుశక్తిని పెంచాలి, స్వయం సమృద్ధి ఉత్పత్తికి దోహద పడాలి. కానీ దేశంలో నడుస్తున్నదంతా ప్రపంచీకరణ మాయాజాలం. దీనికి అడ్డుకట్ట వేయగలిగేది పౌరసమాజమే.
ఆ ‘ఛాతీ’ ఏంచేస్తోంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


