తాత్కాలిక కార్యాలయాలలో స్థలం లేక ఇబ్బంది
నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో మండల పశు వైద్యశాలకు చికిత్స కోసం పశువులను తీసుకెళ్లే దారిలో పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పెట్టడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్ , పశు వైద్యశాల ఒకే కాంపౌండ్ వాల్ లో ఉన్నాయి. అంతేగాక కార్యాలయాల చుట్టూ తగినంత స్థలము లేకపోవడంతో, పట్టుబడ్డ వాహనాలను భద్రతతో ఉంచవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. దీంతె చేసేదేమీ లేక వారు కాంపౌండ్ వాల్ లోనే వాహనాలను నిలుపుతున్నారు. చికిత్స కోసం పశువులను తీసుకొచ్చే రైతులు పోలీస్ స్టేషన్ ద్వారం ద్వారా తీసుకొచ్చి ఇబ్బందితో చికిత్స చేయించుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలిక కార్యాలయాలకు స్థలంతో పాటు, కార్యాలయాలను మంజూరు చేయాలని కోరుతున్నారు. రైతులకు ఇబ్బందిని కలిగించే వాహనాలను తొలగించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
పశువుల దవఖానాకు దారేది..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES