వద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇటీవల మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపిస్తూ టీజర్ కట్ చేసిన విధానం, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌లో మరో అద్భుతమైన చిత్రం రానుందనే విజువల్స్, భయపెట్టేలా చూపించిన కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతంతోపాటు పీటర్ కథ ఏంటి? జెస్సీ ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్ చెప్పకనే చెప్పింది.
ఈ ‘పీటర్’ కథ ఏంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



