నవతెలంగాణ – జన్నారం
ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ‘ఎడిటర్ ధనుంజయ రెడ్డి పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారి పై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్బంగా జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు నర్సయ్య మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిగా ఎంతో క్రియ శీల పాత్ర పోషిస్తున్న జర్నలిస్ట్ లపై కక్ష పూరితంగా వ్యవరించడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ పై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గాజుల లింగన్న గౌడ్, స్థానిక జర్నలిస్ట్ లు కందుల రమేష్, అమరగొండ సతీష్, కాంతయ్య, కొత్త వేణు గోపాల్ గుప్తా, మేడ మురళి,ముస్తఫా,గొనె సత్యం, శివరామకృష్ణ, జీవీపీ రాజు, నిమిషా కవి రాజు, అజ్మత్ , ఐలవేణి నర్సయ్య,మల్లేష్, కస్తూరి సతీష్, కాంగ్రెస్ నాయకులు గంగన్న యాదవ్, మహేంద్ర సంఘo నాయకులు కోడి జుట్టు రాజన్న తదితరులు పాల్గొన్నారు.
జన్నారంలో జర్నలిస్టుల రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES