Monday, December 15, 2025
E-PAPER
Homeదర్వాజకొత్త సంవత్సరంను కొత్తగా అడిగేదేమి….

కొత్త సంవత్సరంను కొత్తగా అడిగేదేమి….

- Advertisement -

ప్రతి సంవత్సరం పతనం మరింతగా
వేడుకలు చూస్తుంటేనే తెలుస్తుంది వెటకారపు
అర్ధరాత్రి అరుపులు ఆనక రోడ్డు మీద జల్సాలు
లక్ష్యం లేని లక్షనాలు వ్యర్ధమైన యువత
ఆడ మనిషి ఆకులు కట్టుకున్నట్లు జానెడు గుడ్డలు
మగ వాడు చినిగిన ప్యాంట్‌ తుట్టె గడ్డం
మనిషి ఇప్పుడు అనాగకరితను ఆస్వాదిస్తున్నాడు
అడగకూడదు ఆదో రకం వాదనలు అడ్డం
ఏడు జన్మలు దేవుడు ఎరుగు
ఒక్క సంవత్సరం కాపురం వెలగడం లేదు
విడాకుల కోసం కోర్టు ముంగిట కొత్త జంటల వరుస
ప్రైవసీ పేరున మంకు పట్టు ఇదొక కొత్త వైరస్‌
ఇంటా బయట లే అఫ్‌ ల గొడవలే
ఇక ఉద్యోగం చాలు అని కంపెనీలు
అత్తా మామ అక్కరలేదు అని కోడళ్ళు
విలువలు లేని నవ సమాజ నిర్మాణం
నీతులను ఫార్వర్డ్‌ చేయడమే కాని
పాటించిన వారు పట్టుమని ఒక్కరు లేరాయే
తలా పావలా వంతు పాపం హుండీలో
దేవుడు శిల గానే మిగిలి బతికి పోయాడు
డిసెంబర్‌ ముప్పై ఒకటి అంటే
బాసలు బాకీలు తిరిగి చూసుకోవడం
డీజే లు పెట్టుకుని కాలం కరిగించడం కాదు కదా
25 ను ఉపయోగించు కోలేదు
26 ను ఇక ఏమి అడిగేది….

దాసరి మోహన్‌, 9985309080

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -