Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుడకుడ రోడ్డుకి మోక్షం ఎప్పుడో.?

కుడకుడ రోడ్డుకి మోక్షం ఎప్పుడో.?

- Advertisement -

తక్షణమే రోడ్లపై ఉన్న గుంటలను పూడ్చాలి..
సూర్యాపేట నుండి దంతాలపల్లి రోడ్డును నాలుగు లైన్లుగా మార్చాలి..
కొత్తపల్లి రేణుక సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

నిత్యం రద్దీగా ఉండే కుడకుడ రోడ్డును నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి నాలుగు లైన్లుగా మార్చాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. బుధవారం వర్షంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రం కుడ కుడ రోడ్డులోని క్రికెట్ అకాడమీ ముందు గుంటలు పడ్డ రోడ్డు దగ్గర ధర్నా  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డుపై పడిన గుంతలను తాత్కాలికంగా నాణ్యత లోపంతో మరమ్మత్తులు చేసి దులుపుకు పోతున్న అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారని అన్నారు.గతంలో అనేక సార్లు మా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డుపై ధర్నా నిర్వహించగా తాత్కాలిక మరమ్మతులు చేశారు కానీ గుంతలు పూడ్చిన రెండు రోజులకే మళ్లీ గుంతలు పడి వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఈ రోడ్డుపైన రోజుకు సుమారు లక్ష వాహనాలు తిరుగుతాయని,ఇంత రద్దీగా ఉన్న రోడ్డుని నిర్లక్ష్యం చేస్తూ, జనాలను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు.

ఈ రోడ్డు గుంటలు పడి ఇరుకుగా ఉండటం వల్ల టూ వీలర్స్ ప్రమాదాలకు గురై చనిపోతున్న, అనేకమంది దెబ్బలు తగిలి హాస్పిటల్ లో పాలవుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు అన్నారు. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చి మరమత్తులు చేపట్టాలన్నారు.అదే విధంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి దంతాలపల్లి వరకు ఉన్న రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ పట్టణ కమిటీ సభ్యుడు ఐతరాజు వెంకన్న,పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యులు ఐతరాజు పద్మ, గౌరమ్మ,విన్ను,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -