Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెనిజులా అధ్యక్షుడిని బంధించడం ట్రంప్ కు హక్కెక్కడిది

వెనిజులా అధ్యక్షుడిని బంధించడం ట్రంప్ కు హక్కెక్కడిది

- Advertisement -

సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ)
నవతెలంగాణ – ఆలేరు 

వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురో యుద్ధ ఉన్మాది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంధించడం హక్కెక్కడిదని సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆలేరులో రైల్వే గేట్ వద్ద ఆ పార్టీ కార్యాలయం ఎదుట నల్ల జెండాలతో నిరసన తెలిపి మాట్లాడారు. ఒక దేశ సార్వభౌమ అధికారం హరించడం మూడో ప్రపంచ దేశాలకు అమెరికాతో పెనుముప్పుగా మారుతుంది అన్నారు. అక్కడున్న ఆయిల్ సంపద పై కన్నేసి అధ్యక్షుడితో పాటు అతని కుటుంబాన్ని న్యూయార్క్ నగరానికి తరలించడం అత్యంత నీచత్వం అన్నారు.

ఆ దేశంలో సమస్యలు ఉంటే అక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారు వారి అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడం ట్రంపు టెంపర్ తనం అన్నారు. మూడో ప్రపంచ దేశాలపై దాడిగానే పరిగణించి అమెరికా చేష్టలను భారత ప్రభుత్వం ఖండించాలన్నారు.

వెనిజులా పై అమెరికా యుద్ధ విమానాలతో ఆదేశం పై దాడి చేసి  బాంబులు వేయడం అధ్యక్షున్ని తీసుకెళ్లడ బందిపోటు చేష్టల్లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు ఆర్ సీత ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్య, జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్, మామిడాల బాల మల్లేష్, మాలోత్ మోతిలాల్ బర్మా బాబు, చింతకింది సత్యనారాయణ, సుంచు రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -