విద్యార్థులు, ఉద్యోగులకిచ్చేందుకు లేవా?
విద్యారంగ సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగులకు డీఏ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు డబ్బులేవంటున్న రేవంత్ సర్కార్‌కు రూ.లక్షల కోట్ల టెండర్లకు డబ్బులెక్కడున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాంసంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడి, 13 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంటే విద్యాశాఖ మంత్రిగా సీఎం ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి రూ.ఫ్యూచర్ సిటీకి 20వేల కోట్లు, మల్లన్నసాగర్ నుంచి మూసిలో గోదావరి నీళ్లు పోసేందుకు రూ.7,000 కోట్లు, జీహెచ్‌ఎంసీలో హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు రూ.7 వేల కోట్లు, ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రోడ్డు కోసం రూ.5 వేల కోట్లు, హెచ్‌ఎండిఏలో రూ.10 వేల కోట్లు, ఆర్ అండ్ బిలో రూ.16 వేల కోట్లు, గురుకులాలను గాలికి వదిలి రూ.25 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రూ.4,400 కోట్లు, మూసీ సుందరీకిరణకు రూ.లక్ష యాభై వేల కోట్లు మొత్తం రూ.2.5 లక్షల కోట్ల టెండర్లను కమిషన్లు దండుకునేందుకు రేవంత్ రెడ్డి పిలుస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ 9 ఏళ్లలో కరోనా, ఆర్థిక మాంద్యం సమయంలోనూ రూ.20 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సగానికి సగం జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు పేరుకు పోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి యాజమాన్యాలదైతే, సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూడైస్ రిపోర్ట్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 47 వేల మంది పిల్లలు తగ్గారని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సర్కారు విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయిం బర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ.లక్షల కోట్ల టెండర్లకు డబ్బులెక్కడివి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES