ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘తన తండ్రి స్థాపించిన ప్రజా మీడియా కార్పొరేషన్ వారసుడిగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తుంటాడు హీరో ఆది పినిశెట్టి. సౌత్ ఇండియాలో పేరున్న ఈ సంస్థ అక్కౌంట్స్‌ను ఒక హ్యాకర్ హ్యాక్ చేస్తాడు.
ఈ హ్యాక్‌తో ప్రజా మీడియా కార్పొరేషన్ గౌరవం, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడతాయి. ఈ హ్యాకర్ ఎవరు?, ప్రజా మీడియా కార్పొరేషన్‌తో పాటు హీరో పర్సనల్ లైఫ్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు?. ఆ హ్యాకర్‌ను హీరో పట్టుకోగలిగాడా లేదా? అనేది టీజర్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ – ఓషో వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అన్నే రవి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – తాతినేని సత్యరావు, డీవోపీ – అబినందన్ రామానుజన్, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ – వివేక్ అన్నామలై, యాక్షన్ – మరేక్ సోలెక్, డైలాగ్స్ – నాగసాయి.
ఆ హ్యాకర్ ఎవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



