- Advertisement -
– సాయంత్రం నాలుగున్నరైన అందని నీరు, ఆహారం
– ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా జర్నలిస్టులను అధికారులు చిన్న చూపు చూస్తోంది. గురువారం కామారెడ్డి జిల్లాలో వరద ప్రాంతాలను బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. వార్త కవరేజ్ కోసం జర్నలిస్టులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 అయినప్పటికీ వారికి నీటి సౌకర్యం గాని, అన్నం గాని పెట్టకపోవడంతో కలెక్టర్ జిల్లా కార్యాలయంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారుల స్పందించి వెంటనే ఆహారాన్ని ఏర్పాటు చేశారు.
- Advertisement -