- Advertisement -
- – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు
నవతెలంగాణ – కామారెడ్డి - కామారెడ్డిలో ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సందర్భంగా గురువారం ఉదయం పోలీసులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఇంటి వద్ద బలవంతంగా అరెస్టు చేయడం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, కొత్త నరసింహులు లు మాట్లాడుతూ ఇది ప్రజా పాలన ప్రజాస్వామ్య పాలనాన్ని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేవాళ్లను ప్రజా హక్కుల కోసం మాట్లాడే వారిని రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించే సిపిఎం నాయకులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
- నిరంతరం కమ్యూనిస్టులు ఉండాలి, ఎర్రజెండా నాయకులు కమ్యూనిజం కోసం మాట్లాడే ముఖ్యమంత్రి కార్మికులను అరెస్టులకు పురిగొల్లుపురం సరైంది కాదన్నారు. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి పంటలు మొత్తం నష్టపోయి, ఎక్కడకక్కడ రోడ్లు, కుంటలు, చెరువులు, తెగిపోయి, వర్షాలకు రైతులు తమ పంట పొలాలను పట్టణాల్లో ప్రజలు తమ ఇండ్లను కోల్పోయి తీవ్ర నష్టం జరిగిందని, ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెంటనే ఈ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీని ఎంత ప్రకటిస్తాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
- Advertisement -