Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చీరల పంపిణీలో వివక్ష ఎందుకు 

చీరల పంపిణీలో వివక్ష ఎందుకు 

- Advertisement -

మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి 
నవతెలంగాణ – రామారెడ్డి 

కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీలో మహిళల పట్ల వివక్ష చూపటం ఎందుకని మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగల శ్రీనివాస్ ప్రశ్నించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మండలానికి 12000 మంది మహిళలకు చీరలు అందజేయవలసి ఉండగా, 7500 చీరలు మాత్రమే సరఫరా చేశారని, 40 శాతం మహిళలకు చీరలు అందించక వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకొని, మహిళల పట్ల వివక్షత చూపడం సరైనది కాదని, బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించినట్లు ప్రతి మహిళకు చీరలు అందించాలని, ముస్లింలకు, క్రిస్టియన్లకు, రంజాన్, క్రిస్మస్ లకు నూతన వస్త్రాలు అందించి సాంస్కృతిని గౌరవించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు నర్సారెడ్డి, రాజేందర్, సిద్ధిరాములు, బాల్ దేవ్ అంజయ్య, జంగం లింగం, హన్మల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -