Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్ల డీపీఆర్‌ను వెనక్కి ఎందుకు పంపారు?

బనకచర్ల డీపీఆర్‌ను వెనక్కి ఎందుకు పంపారు?

- Advertisement -

తెలంగాణ వాటా ఇవ్వాల్సిందే.. లేదంటే సహించేది లేదు : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను ఎందుకు వెనక్కి తిప్పి పంపాయని ? మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, ఎన్విరాన్‌మెంట్‌ సంస్థలు ఎందుకు బనకచర్ల డీపీఆర్‌ను తిరస్కరించాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నాయకుల మౌనం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. అప్పటిలాగే నీళ్లు తీసుకుపోతే చూస్తూ ఊరుకునేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి చంద్రబాబుకు వంత పాడుతున్నారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నందునే ఏపీ మంత్రి లోకేశ్‌ బనకచర్ల నిర్మించి తీరుతామని చెబుతున్నారని హరీశ్‌రావు వెల్లడించారు. బనకచర్లపై చంద్రబాబు బుల్డోజర్‌ విధానానికి బీజేపీ, కాంగ్రెస్‌ల మౌనమే కారణమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏడుసార్లు ఉత్తరాలు రాస్తే, లోకేశ్‌ ఎప్పుడూ అడ్డుకోలేదని చెబుతున్నారని తప్పుపట్టారు. తెలంగాణలో రెండు నదులను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయనీ, దీన్ని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు 968 టీఎంసీలను తెలంగాణకు వాటాగా కేటాయించారనీ, అయిన ప్పటికీ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 968 టీఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటూ కేంద్రానికి రాసిన లేఖలను ఉప సంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబుది ప్రాంతీయ విద్వేషమా? : లోకేశ్‌కు హరీశ్‌రావు ప్రశ్న
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబ్లీ, ఆల్‌మట్టిపై పోరాడిన చంద్రబాబునాయుడిది ప్రాంతీయ విద్వేషమా? అని ఏపీ మంత్రి లోకేశ్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరి నదిలో తెలంగాణ వాటా అడిగితే ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నామని తమను విమర్శిస్తున్న లోకేశ్‌ ముందు చంద్రబాబు గురించి చెప్పాలన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ తెలంగాణ హక్కులను కాపాడుతుందని స్పష్టం చేశారు. అనుమతులు తెచ్చుకునే పద్ధతి మీకు తెలిస్తే, ఆపే పద్ధతి కూడా మాకు తెలుసని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు , 8 మంది బీజేపీ ఎంపీలు అడ్జర్నమెంట్‌ మోషన్‌ ఇచ్చి ఎందుకు బనకచర్ల మీద నిలదీయడం లేదు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -