– అచ్యుతాపురంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ముఖాముఖీ
– పోటీ దారులూ కంటే వారిని బలపర్చిన వారిదే ప్రతిష్ట
నవతెలంగాణ – అశ్వారావుపేట
పదవీ, హోదాతో కూడిన అధికార అభిరుచిని తొందరగా మర్చిపోలేరు.అందుకే ఏదో ఒక పదవితో సాధికారత ను పొందాలనుకుంటారు.ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఎన్నో వైరుధ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో తెలుగు,ఆంగ్ల బాషల్లో అక్షర క్రమంలో ముందుండే పంచాయితి అచ్యుతాపురం. ఈ పంచాయితి లో 2013 లో సర్పంచ్ గా పనిచేసిన బెల్లం సుజాత భర్త బెల్లం గణేష్(భీం సేన్) నేడు సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ లో ఉన్నాడు.ఈయనను బీఆర్ఎస్ బలపర్చగా ప్రత్యర్థిగా పోటీలో ఉన్న మాజీ ఉపాధి హామీ సహాయకుడు పోలయ్య ను కాంగ్రెస్ బలపరుస్తుంది.
అయితే ఈ సర్పంచ్ ల అభ్యర్ధుల జయాపజయాలు వారిని బలపరిచిన ఇరు పార్టీల్లో ఉన్న అగ్రవర్ణ సామాజిక మండల స్థాయీ నేతలకు సవాల్ గా మారింది. ఈ ఇరువురు నేతలు ఒకే సామాజిక వర్గానికి,ఒకే ఇంటి పేరుగల సమీప బంధువులు అయినప్పటికీ గ్రామ పెద్దలు పట్టింపులు తో ఏకగ్రీవం అయ్యే ఈ పంచాయితి కాస్త ముఖాముఖీ గా తలపడాల్సి వచ్చింది. అధికారపక్షం గెలుస్తుందో లేక ప్రతి పక్షం విజయం సాధిస్తుందో అనేది ఉత్కంట రేపుతోంది.



